Hyderabad : హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని నిందితులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
అయితే హీరో అల్లు అర్జున్ మాత్రం ఇందుకు మినహాయింపు కోరారు.
అల్లు అర్జున్ హాజరుపై...
తాను షూటింగ్ లో ఉన్నందున వర్చువల్‌గా అటెండ్ అవ్వడానికి అనుమతి కోరుతూ అల్లు అర్జున్ పిటిషన్ వేశారు. అల్లుఅర్జున్‌కు వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతులివ్వొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై నేడు నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

