ఇంధన పొదుపుపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వాహనాల వినియోగంపై కొత్త నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. పోలీస్ శాఖలో కార్ పూలింగ్ తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు చర్యలు పాటించాలన్న పిలుపు మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఒకే వాహనంలో...
వీఐపీ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్య తగ్గించాలని నిర్ణయించారు. ఒకే ఆఫీస్‌కు వెళ్లే అధికారులు ఒకే వాహనం వాడాలని పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారానే సమీక్షలు నిర్వహించాలని, అధికారుల రాకపోకలు తగ్గించుకోవాలని పేర్కొన్నారు. మెట్రో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాడాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

