Harare : భారత్ మూడు టీ 20 మ్యాచ్ లలో విజయం సాధించింది. జింబాబ్వేను వైట్ వాష్ చేసింది. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన 81 పరుగులతో రాణించగా, మయాంక్ యాదవ్ నేతృత్వంలోని భారత బౌలర్లు సమష్టిగా మెరవడంతో జింబాబ్వేపై మూడో, చివరి టీ20లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇంగ్లండ్‌తో 0-4, ఐర్లాండ్‌తో 0-2 తేడాతో వరుసగా రెండు సిరీస్‌లు కోల్పోయిన తర్వాత భారత్‌కు ఇది ఊరటనిచ్చే ఫలితంగా నిలిచింది.
లక్ష్య ఛేదనలో...
193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నెమ్మదిగా ఉన్న పిచ్‌పై ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. ర్యాన్ బర్ల్ అజేయంగా 54 పరుగులు చేసి పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే 7 వికెట్లకు 157 పరుగులకే పరిమితమైంది.మునుపటి మ్యాచ్‌ల మాదిరిగానే జింబాబ్వే తొలి ఓవర్లలోనే కీలక వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకోలేకపోయింది. యశ్ ఠాకూర్ నాలుగో ఓవర్లో వరుస బంతుల్లో డియాన్ మైయర్స్, కెప్టెన్ సికందర్ రజాలను ఔట్ చేసి ప్రత్యర్థికి గట్టి దెబ్బ కొట్టాడు. అప్పటికే తొలి బంతికే బ్రయన్ బెన్నెట్‌ను పెవిలియన్‌కు పంపిన మయాంక్ యాదవ్ తన వేగం, కచ్చితత్వంతో జింబాబ్వేను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు.భారత్ నాలుగు క్యాచ్‌లు వదిలేయడం, కొన్ని సులభమైన బౌండరీలు ఇవ్వడం వల్ల జింబాబ్వేకు కొంత ఊరట లభించింది. బర్ల్, వెస్లీ మధేవెరె (28) ఐదో వికెట్‌కు 60 పరుగులు జోడించినా అప్పటికే జరిగిన నష్టం చాలా పెద్దదిగా మారింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని...
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్ కోసం తంటాలు పడుతున్న అభిషేక్ శర్మ కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు.అయితే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈసారి దూకుడుతో పాటు సహనాన్ని కూడా ప్రదర్శించాడు. 49 బంతుల్లో 81 పరుగులు చేసిన అతడు తొలి 10 బంతుల్లో 11 పరుగులే చేశాడు. తర్వాత క్రమంగా వేగం పెంచి 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. ఇది అతడి టీ20 కెరీర్‌లో రెండో అర్ధశతకం.బ్రాడ్ ఇవాన్స్ వేసిన యార్కర్‌ను స్ట్రెయిట్ డ్రైవ్‌తో బౌండరీకి తరలించడం, సికందర్ రజా బౌలింగ్‌లో 102 మీటర్ల భారీ సిక్సర్ బాదడం అతడి ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. స్పిన్నర్ మధేవెరె బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌తో బౌండరీ సాధించి తన వినూత్న షాట్‌లను కూడా ప్రదర్శించాడు.మరోవైపు అభిషేక్ శర్మ వరుసగా ఆరోసారి నిరాశపరిచాడు. బ్లెసింగ్ ముజరబానీ బౌలింగ్‌లో ఎడ్జ్ ఇవ్వడంతో వికెట్‌కీపర్ తడి మరుమాని క్యాచ్ అందుకున్నాడు. అభిషేక్ గత ఆరు ఇన్నింగ్స్ స్కోర్లు వరుసగా 10, 16, 3, 1, 8, 2గా నమోదయ్యాయి.సూర్యవంశీ మాత్రం ఇషాన్ కిషన్ (29)తో రెండో వికెట్‌కు 75 పరుగులు, శ్రేయస్ అయ్యర్ (27)తో మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించి జట్టుకు బలమైన పునాది వేశాడు. శతకానికి చేరువలో ఉన్న సమయంలో మధేవెరె బౌలింగ్‌లో బ్రాడ్ ఇవాన్స్ లాంగ్ ఆఫ్ వద్ద అద్భుత క్యాచ్ అందుకోవడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసింది.సూర్యవంశీ, శ్రేయస్ ఔటైన తర్వాత మధ్యవరుస ఆశించినంత వేగంగా పరుగులు చేయలేకపోయింది. చివరి ఐదు ఓవర్లలో భారత్ 47 పరుగులే సాధించింది. చివర్లో రింకూ సింగ్ 14 బంతుల్లో 25 పరుగులు చేసి జట్టు స్కోరును 200కు చేరువ చేశాడు.

