హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అత్యవసరంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా విమానం ల్యాండ్ అయింది.
సాంకేతిక సమస్యలు తలెత్తాయని సమాచారం అందడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు.
శంషాబాద్ లో అత్యవసర ల్యాండింగ్...ఈ ఇండిగో విమానం బెంగళూరు నుంచి నాగ్‌పూర్ వెళ్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇండిగో విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను శంషాబాద్ ఎయిర్ పోర్టులో పరిశీలిస్తున్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

