ఐపీఎల్ లో నేడు మరో బిగ్ ఫైట్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ ఢీ కొంటుంది. రాత్రి 7.30 గంటలకు జైపూర్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
ఇరుజట్లలో రాజస్థాన్ రాయల్స్ మాత్రమే ప్లే ఆఫ్ రేసులో నాలుగో స్థానంలోకి ప్రవేశించడానికి ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే రాజస్థాన్ ప్లే ఆఫ్ రేసులోకి చేరుకునేందుకు వీలవుతుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్ లో ఆడటం కేవలం నామమాత్రమే.
రాజస్థాన్ రాయల్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ ఢీ...
ఎందుకంటే గెలిచినా ప్రయోజనం లేదు. ఓడినా అంతే. ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి వరకూ పన్నెండు మ్యాచ్ లు ఆడి నాలుగు మ్యాచ్ లు మాత్రమే గెలిచి ఎనిమిది మ్యాచ్ లలో ఓడింది. దీంతో ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం పన్నెండు మ్యాచ్ లు ఆడి ఆరు మ్యాచ్ లు గెలిచి ఆరు మ్యాచ్ లలో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. నాలుగో స్థానం కోసం పోటీ పడుతుంది.

