ఐపీఎల్ నేడు మరో బిగ్ ఫైట్ జరగనుంది. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢీకొంటుంది. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ చెన్నైకు కీలకం. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కు కూడా అంతే ముఖ్యం. ప్లే ఆఫ్ రేసులో ముందులో ఉండాలంటే ఇరు జట్లు గెలుపు కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగే ఛాన్స్ ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ...సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకూ పన్నెండు మ్యాచ్ లు ఆడి ఏడు మ్యాచ్ లలో గెలిచింది. ఐదు మ్యాచ్ లలో ఓడింది. పథ్నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తం పన్నెంబడు మ్యాచ్ లు ఆడి ఆరు మ్యాచ్ లలో గెలిచింది. ఆరింటిలో ఓడింది. పన్నెండు పాయింట్లతో ప్లే ఆఫ్ కోసం పోరాడుతుంది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.

