Dailyhunt
IPL 2026 : హైదరాబాద్ పై  కోల్ కతా నైట్ రైడర్స్ గెలుపు

IPL 2026 : హైదరాబాద్ పై కోల్ కతా నైట్ రైడర్స్ గెలుపు

TeluguPost.com 1 week ago

పీఎల్ లో చివరి దశకు చేరుకునే సరికి మ్యాజిక్ లు చోటు చేసుకుంటున్నాయి. వరసగా ఐదు గెలుపులతో ఊపు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమిపాలయింది.

వరస ఓటములతో ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ గెలుపు బాట పట్టింది. హైదరాబాద్ సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమి పాలు కావడంతో పాయింట్ల పట్టికలో పెద్దగా స్థానం కోల్పోకపోయినా.. రానున్న కాలంలో ఇబ్బందులు తప్పేట్లు లేవు. ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.

అతి తక్కువ పరుగులు...

తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై ఓవర్లకు గాను కేవలం 165 పరుగులు మాత్రమే చేసింది. అభిషేక్ శర్మ తర్వగా అవుటయినా ట్రావిస్ హెడ్ 61 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 42 పరుగులతో రాణించాడు. 8.5 ఓవర్లకే వంద పరుగులు చేసినప్పటికీ తర్వాత వరసగా అవుట్ కావడంతో అతి తక్కువ పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తక్కువ పరుగులు చేసి కోల్ కతా నైట్ రైడర్స్ కు విజయం దక్కడానికి మార్గం సులువు చేసింది.వరుణ్ చక్రవర్తి మూడు, నరైన్, త్యాగి తలో రెండు వికెట్లు తీశారు.

అతి సులువుగా...

ఇక 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి కోల్ కతా నైట్ రైడర్స్ పెద్దగా కష్టపడకుండానే విజయం సాధించినట్లయింది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రఘువంశీ 59 పరుగులు చేశాడు. దీనికి అంజిక్యా రహానే 43 పరుగులు జోడించడంతో పాటు చివరలో వచ్చిన రింకూ సింగ్ బాదుడు దెబ్బకు కోల్ కతా నైట్ రైడర్స్ సునాయాసంగా విజయం సాధించినట్లయింది. రింకూ సింగ్ 22 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో సాకిబ్ హుస్సేన్, ప్యాట్ కమిన్స్, శివంగ్ కుమార్ లు తలో వికెట్ మాత్రమే దక్కించుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu