Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IPL 2026 : పంజాబ్ మళ్లీ ఓడింది.. టైటాన్స్ గెలిచింది

IPL 2026 : పంజాబ్ మళ్లీ ఓడింది.. టైటాన్స్ గెలిచింది

TeluguPost.com 3 weeks ago

పీఎల్ చివరి దశకు చేరుకునే సరికి ఇప్పటి వరకూ అప్రతిహతంగా విజయాలు నమోదు చేసుకుంటున్న జట్లు ఓటమి పాలవుతున్నాయి. ఓడిన జట్లు గెలుపు బాట అందుకున్నాయి.

తాజాగా పంజాబ్ కింగ్స్ మరో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ ఓటమి పాలయింది. పంజాబ్‌ను 163 పరుగులకు కట్టడి చేసిన గుజరాత్ బౌలర్లు తర్వత 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని టైటాన్స్ చేరుకుంది. పాయిట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ విజయం సాధించింది.

పంజాబ్ తడబడి...మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు తొమ్మిదో ఓవరుకే 47 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో సూర్యాంశ్ షెఢ్గే (57) నిలకడగా ఆడాడు. మార్కస్ స్టోయినిస్ (40)తో కలిసి 44 బంతుల్లో 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే వీరు అవుటైన తర్వాత చివరి ఓవర్లలో పంజాబ్ పరుగుల వేగం పెరగలేదు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులకే పరిమితమైంది. అతి తక్కువ పరుగులకే అవుట్ కావడంతో గుజరాత్ టైటాన్స్ టార్గెట్ సులువుగా మారింది. లక్ష్య ఛేదనలో...లక్ష్య ఛేదనలో సాయి సుదర్శన్ 41 బంతుల్లో 57 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. జోస్ బట్లర్ (26), వాషింగ్టన్ సుందర్ (40) కూడా తోడయ్యారు. గుజరాత్ జట్టు 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ (2/24), విజయ్‌కుమార్ వైశాక్ (2/31) తలో రెండు వికెట్లు తీశారు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ రెండు ఓటములతో పంజాబ్ కింగ్స్ జట్టు ఒకింత షాక్ లో ఉంది. మొత్తం మీద చివరకు ప్లే ఆఫ్ సీజన్స్ కు ఏ టీం చేరుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu