Dailyhunt
IPL 2026 : వర్షంతో నిలిచిన మ్యాచ్

IPL 2026 : వర్షంతో నిలిచిన మ్యాచ్

TeluguPost.com 1 week ago

కోల్ కతాలో ప్రారంభమయిన మ్యాచ్ వర్షంతో నిలిచిపోయింది. పంజాబ్ కింగ్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్ లో తలపడింది. టాస్ నెగ్గిన కోల్ కతా బ్యాటింగ్ ను ఎంచుకుంది.

తొలుత కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ కు దిగింది. రెండు వికెట్లు కోల్పోయిన కోల్ కతా కుదుకుంటున్న దశలో వర్షం మొదలయింది. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. చాలా సేపు వర్షం ఆగుతుందేమోనని చూశారు.

చెరొక పాయింట్ తో...ఎప్పటికీ వర్షం ఆగకపోవడంతో ఇక మ్యాచ్ నిర్వహించడం కష్టసాధ్యమని గ్రహించిన అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. దీంతో రెండు జట్లకు చెరొక పాయింట్ లభించినట్లయింది. ఈ మ్యాచ్ లో అసలు గెలవని కోల్ కతా నైట్ రైడర్స్ ఖాతాలో ఒక పాయింట్ చేరింది. పంజాబ్ ఐదు పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu