జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగానే జలమండలి జీఎం కుమార్ సంపాదించినట్లు ఈ సోదాల్లో కనుగొన్నారు.
వందల కోట్ల ఆస్తులు...
హైదరాబాద్ లోని మల్లాపూర్ లోని కుమార్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక గేటెడ్ కమ్యునిటీలో 9 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా స్థిరాస్థులు కూడా ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. నిజామాబాద్ లో మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో కుమార్ నివాసంలో 1.10 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారని, సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.

