Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Janasena : జనసేనలో చేరికలు శూన్యం.. అసలు రీజన్ ఇదేనా?

Janasena : జనసేనలో చేరికలు శూన్యం.. అసలు రీజన్ ఇదేనా?

TeluguPost.com 9 hrs ago

Andhra Pradesh : జనసేన పార్టీ నాయకత్వం ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. జనసేన లో చేరికలు లేవు. సొంత సామాజికవర్గం నేతలే జనసేనలో చేరకుండా కూటమి లోని టీడీపీలో చేరుతున్నారు.

దీనికి కారణం ఏంటి? లోపాలు ఎక్కడ? అన్నదానిపై సమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమయింది. తాజాగా ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతానికి చిన్న శ్రీనును చేర్చుకోవాల్సి ఉండగా, ఆయన పసుపు కండువా కప్పుకోవడం పార్టీలోనూ చర్చనీయాంశమైంది. నాయకత్వంలో ఏకపక్ష నిర్ణయాలు, తమకు రాజకీయ భవిష్యత్ ఉండదన్న భావన ఎక్కువగా ఉండటం వల్లనే జనసేనలో చేరికలు లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. జనసేన పార్టీలో 2024 ఎన్నికల తర్వాత ఆశించిన స్థాయిలో చేరికలు లేకపోవడానికి, లేదా వలసలపై పార్టీ ఆచితూచి అడుగులు వేయడానికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. గతంలో చేరికలపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, ప్రస్తుతం 2026 నాటికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా 14 మంది సభ్యులతో కూడిన 'జాయినింగ్స్ కమిటీ'ని ఏర్పాటు చేసి, పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు.

కూటమి ధర్మం మరియు సర్దుబాట్లు... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇతర పార్టీల నుంచిప్రధానంగా వైసీపీ నేతలను చేర్చుకుంటే, స్థానికంగా ఉన్న టీడీపీ లేదా బీజేపీ నేతలతో వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కూటమిలో ఎలాంటి ఘర్షణలు రాకూడదనే ఉద్దేశంతోనే చేరికలపై జనసేన అధినాయకత్వం ఆచితూచి వ్యవహరించింది. కూటమి ఒప్పందంలో భాగంగా జనసేన పరిమిత సంఖ్యలోనే పోటీ చేసింది. భవిష్యత్తులో కూడా సీట్ల సర్దుబాటు ఉంటుంది కాబట్టి, ఇతర నియోజకవర్గాల నుండి పెద్ద నేతలు వచ్చినా వారికి టికెట్లు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. ఈ క్లారిటీ ఉండటం వల్లే వలసలు నెమ్మదించాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుండి జెండా మోసిన పాత నాయకులు, 'వీర మహిళలు', కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుండి వచ్చే వలస నేతలకు ప్రాధాన్యత ఇస్తే, సొంత క్యాడర్ అసంతృప్తికి గురవుతుందనే ఆలోచన కూడా ఉంది. గతంలో పార్టీలో చేరిన కొందరు నేతలకు తగిన ప్రాధాన్యత దక్కలేదనే టాక్ నడిచింది. అలాగే క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి కమిటీల ఏర్పాటు ఆలస్యం కావడం వల్ల కూడా కొత్తగా చేరే వారికి సరైన దిశానిర్దేశం లేకుండా పోయింది.అధికారిక బాధ్యతలపై దృష్టి...ఎన్నికల విజయం తర్వాత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖల మంత్రిగా ప్రభుత్వ బాధ్యతల్లో బిజీ అయ్యారు. దీనివల్ల రాజకీయ చేరికల కంటే పాలనపై, గ్రామాల అభివృద్ధిపై ఆయన ఎక్కువ సమయం కేటాయించారు. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 2026లో 14 మంది సభ్యులతో ఒక అధికారిక చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలను పార్టీలోకి క్రమపద్ధతిలో ఆహ్వానించ డానికి మరియు పార్టీ సభ్యత్వ నమోదును భారీగా పెంచడానికి ఈ చర్యలు చేపట్టారు. కానీ జనసేనలోచేరాలంటే షరతులు వర్తిస్తాయి అన్నట్లు వ్యవహారం ఉందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అలాగే జనసేనలో చేరి సీటు సంపాదించడం కంటే టీడీపీ, బీజేపీలో చేరి టిక్కెట్ పొందడం సులువు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనివల్లనే చేరికలు పెద్దగా లేవన్నది సుస్పష్టం. చేర్చుకున్న నేతలతో పార్టీ బలోపేతం అవుతుందన్నదీ నిజం కాకపోవచ్చు. కానీ పార్టీని బలోపేతం చేయాలంటే ప్రస్తుతమున్న నాయకత్వానికి పగ్గాలు అప్పగిస్తే ఫలితం అనుకూలంగా ఉంటుందన్నఅభిప్రాయం జనసేనలో ఎక్కువగా వినపడుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu