Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Janasena : నాగబాబు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారా? నిజమెంత?

Janasena : నాగబాబు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారా? నిజమెంత?

TeluguPost.com 0 months ago

నసేన ఎమ్మెల్సీ నాగబాబుకు రాజ్యసభ పదవి దక్కే అవకాశాలున్నాయి. జనసేనకు కేటాయించే ఒక్క దానిని నాగబాబుకు ఇవ్వాలని పవన్ డిసైడ్ అయినట్లుంది. ఈ మేరకు పార్టీలో ప్రచారం జరుగుతుంది.

నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ అనేక సమీకరణాలతో ఆ ప్రతిపాదనను పవన్ కల్యాణ్ పక్కన పెట్టేశారు. నాగబాబుకు ఇక మంత్రి వచ్చే అవకాశం లేదు. అందుకే ఆయనను పెద్దల సభకు పంపితే ఢిల్లీ స్థాయిలో పార్టీకి, తనకు అండగా ఉంటారని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇందుకు నాగబాబు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

అనేక కారణాలతో...నాగబాబుకు మంత్రి పదవి వస్తుందని ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మీడియా ఎదుట బహిరంగంగానే చెప్పారు. కానీ సామాజికవర్గాల సమీకరణ నాగబాబు మంత్రి పదవికి అడ్డంకిగా మారింది. ఇప్పటికే జనసేనకు చెందిన ఇద్దరు కేబినెట్ లో ఉన్నారు. పవన్ కల్యాణ్, కందుల దుర్గేష్ ఉండటంతో నాగబాబుకు కూడా మంత్రి పదవి ఇస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని పవన్ కల్యాణ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే తనను ఒక కులానికి పరిమితం చేయవద్దని పదే పదే చెబుతుండటం కూడా ఈ ప్రచారానికి కొంత ఊతమిస్తుంది. ఎప్పుడో దక్కాల్సి ఉన్నా...నాగబాబుకు ఎప్పుడో మంత్రి పదవి దక్కాల్సింది. అయితే పవన్ కల్యాణ్ అన్ని రకాలుగా ఆలోచించి నాగబాబును కేబినెట్ లోకి తీసుకోకూడదని నిర్ణయించారని సమాచారం. నాగబాబును కాకుండా మరో బీసీ వర్గానికి మంత్రి పదవి ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి కొంత రాజకీయంగా ఉపయోగంగా ఉంటుందన్న అంచనాతో నాగబాబును ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. తన సోదరుడికి ఆ పదవి ఇస్తే కొంత గౌరవం కూడా ఇచ్చినట్లవుతుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా అధికార ప్రకటన రాకపోయినప్పటికీ జనసేన పార్టీ రాజ్యసభ పదవి లింగమనేని రమేష్ కు కాకుండా నాగబాబుకు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత అనేది త్వరలోనే తెలియనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu