Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Janasena : పవన్ ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నం మొదలు పెట్టినట్లేనా?

Janasena : పవన్ ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నం మొదలు పెట్టినట్లేనా?

TeluguPost.com 6 hrs ago

Andhra Pradesh : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పదవులను భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకు ఆగస్టు 15వ తేదీ డెడ్ లైన్ గా పెట్టుకున్నారు.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గంలో జనసేన పదవులను భర్తీ చేసేందుకు పవన్ సిద్ధమయ్యారు. దీంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచనలో ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఆశించాలంటే తమకు అన్ని నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వంతో పాటు ఓటు బ్యాంకు కూడా ఉందని చాటి చెప్పాలి. అందుకోసమే ఆయన ప్రత్యేకంగా పార్లమెంటుల వారీగా కమిటీలను పంపించి కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి పార్టీ పదవులను భర్తీ చేయనున్నారు.

పథ్నాలుగు ఏళ్ల నుంచి...జనసేన పార్టీ 2012లో ఆవిర్భవించినా ఇంత వరకూ రాష్ట్ర వ్యాప్తంగా నాయకత్వాన్ని నియమించలేదు. అందుకు పవన్ కు ప్రత్యేక కారణాలున్నాయి. పార్టీ పేరు చెప్పుకుని కొందరు అవినీతికి పాల్పడతారని, ఆ చెడ్డ పేరు పార్టీకి తొలిదశలోనే రాకూడదని భావించి ఇన్నాళ్లూ పార్టీ పదవులను నియమించలేదు. 175 నియోజకవర్గాలకు పూర్తి స్థాయిలో ఇన్ ఛార్జులను కూడా నియమించలేదు. కొన్ని నియోజకవర్గాలకే నమ్మకమైన నేతలకు మాత్రమే పదవులను కట్టబెట్టారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావడంతో జనసేనలోనూ పదవుల కోసం కొంత క్యాడర్ లో చర్చ మొదలయింది. నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయం చేసుకోవడానికి ఒక ఇన్ ఛార్జి అవసరమని పవన్ గుర్తించారు. అందుకోసమే ఈ చర్యను చేపట్టారు.రానున్న ఏ ఎన్నికల్లోనైనా...ఇదొక్కటే కాదు.. వచ్చే ఏ ఎన్నికల్లోనైనా తమకు స్థానాల కేటాయింపు విషయంలో అన్యాయం జరగకూడదని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఈసారి జనసేన సర్దుకుని వెళ్లే అవకాశం కూడా కనిపించడం లేదు. అయితే అందుకు ముందుగా తమ బలాన్ని పెంచుకోవాలి. బలగాన్ని సమకూర్చుకోవాలి. పార్టీ నియోజకవర్గాల్లో పటిష్టంగా ఉంటే ఖచ్చితంగా స్థానాల కోసం యాచించకుండా శాసించే స్థాయికి రావచ్చన్న ఆలోచనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లోపే నియోజకవర్గాలన్నింటిలో పదవులను భర్తీ చేసి వీలయినన్ని స్థానాలను చేజిక్కించుకుని జనసేనను బలోపేతం చేయాలని చూస్తున్నారు. ఈ మేరకు ఆయన కసరత్తు ప్రారంభించారు. ఆగస్టు 15వ తేదీ నాటికి పదవులన్నింటినీ భర్తీ చేసే అవకాశాలున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu