తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేడు తిరుచ్చి నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజెప్పేందుకు వెళ్లారు.
అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో విజయ్ మాట్లాడుతూతమిళనాడు: నేను సీఎంను కానని, తాను ప్రజా సేవకుడినని సీఎం విజయ్ అన్నారు. తనను ప్రజలు సోదరుడిలా ఆదరించాదరన్న విజయ్ ప్రభుత్వం ఏర్పాటయి నెల రోజులు కాకముందే విమర్శలు మొదలు పెట్టారన్నారు.
ఆరు రోజులకే విమర్శలా?
తమ ప్రభుత్వం ప్రజలకు మంచి మాత్రమే చేస్తుందని విజయ్ చెప్పారు. విపక్షాలు ఆరు నెలల సమయమిచ్చి విమర్శిస్తామన్నారని, ఆరు రోజుల నుంచే ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారని సీఎం విజయ్ అన్నారు. లంచం లేని తమిళనాడుగా తీర్చిదిద్దాలన్నదే తమ అభిమతమన్న విజయ్ అందుకు కొంత సమయం పడుతుందని అన్నారు. ఏదైనా వెంటనే చేయలేమని, ఇది మ్యాజిక్ కాదని, తన తపనంతా పేదలకు న్యాయం చేయడమేనని విజయ్ అన్నారు. తాను కోటు వేసుకున్నా విమర్శలు చేస్తున్నారని, డబ్బున్న వాళ్లు, ఉన్నత కులంలో పుట్టిన వారు మాత్రమే కోట్లు వేసుకోవాలా? అని ప్రశ్నించారు.

