ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్ ఒకటో తేదీన కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో జూన్ 1 న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఉంటుందని అధికారులు తెలిపారు.
తుని మండలం చామవరంలో పేదల సేవలో..ప్రజావేదిక ..ఎన్ టీ ఆర్ భరోసా ఫించన్ల పంపిణీ.. క్యాడర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు.
ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ...కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. మొత్తం మూడు కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో భద్రతతో పాటు కార్యక్రమాలకు సంబంధించిన విషయాలపై కలెక్టర్ చర్చించారు. ఈ రోజు ఉదయం చామవరంలో సీఎం పర్యటన ఏర్పాట్లు, భద్రత ఏర్పాట్లపైకలెక్టర్ ఎం ఎన్ హరేంధిర ప్రసాద్, జేసీ అపూర్వ భరత్, ఇంచార్జి ఎస్పీ రాహుల్ మీనా, సిఎం సెక్యూరిటీ అధికారులు. సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ సానా సతీష్, తుని ఎమ్మెల్యే యనమల దివ్య తదితరులు పాల్గొన్నారు.

