కడప జిల్లాలో నేడు మంత్రి నారా లోకేశ్ రెండవ రోజు పర్యటన కొనసాగుతుంది. జమ్మలమడుగు నియోజకవర్గం లో 2,400 కోట్లతో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు.
ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ 'ఎస్ ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీఆధ్వర్యంలో సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుుతంది. కడప జిల్లా కొండాపురం మండలం టి.కోడూరువద్ద సోలార్ ప్రాజెక్టు పూర్తి కానుంది. రూ.2,400 కోట్ల పెట్టుబడితో.. రెండు ప్రాంతాల్లో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఏటా 87.6 కోట్ల యూనిట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి జరగనుంది.
తాడిపత్రి మండలంలోనూ...
కొండాపురం మండలం టి.కోడూరు, సరిహద్దులోని అనంత పురం జిల్లా తాడిపత్రి మండలం బొడాయిపల్లి పరి ధిలో రూ.1,200 కోట్లతో 300 మెగావాట్లతో ఇంకో ప్లాంట్ ఏర్పాటు కానుంది. జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం దిగువ కలువట్ల, నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం గోవింద పల్లె పరిసరాల్లో కలిపి మరో 300 మెగావాట్ల ప్రాజెక్టును రూ.1,200 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా సుమారు 500 మందికి ఉపాధి లభించనుంది.

