కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. డీకే శివకుమార్ కర్ణాటక సీఎల్పీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నేతగా డీకే శివకుమార్ ను ఎన్నుకున్నారు.
దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవి బాధ్యతలను చేపట్టనున్నారు.
జూన్ 3వ తేదీన ప్రమాణం...కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 3వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు లోక్ భవన్ కు కూడా సమాచారం ఇచ్చారు. లోక్ భవన్ లోనే డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పండితులు పెట్టిన ముహూర్తం మేరకు డీకే ఈ తేదీని ఎంచుకున్నారు.

