Hyderabad : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోదా ఆసుపత్రికి వెళ్లారు. గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేవుడున్నాడు, డాక్టర్లున్నారు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. గుండె చెదరొద్దు ధైర్యంగా ఉండాలని కోరారు. పెద్ది సుదర్శన్ రెడడ్ి భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్న అత్యున్నత చికిత్సపై ఆరా కేసీఆర్ తీశారు. ప్రపంచ స్థాయి అత్యుత్తమ చికిత్స అందుతున్నది, పూర్తి స్థాయి సమాచారం ఇవ్వడానికి మరో 48 గంటలు పడుతుందని కేసీఆర్ యశోద డాక్టర్లు తెలిపారు.
అందుతున్న చికిత్సను...
పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందుతున్న ఐసీయూ వార్డుకు చేరుకొని, డాక్టర్లతో కలిసి పెద్దికి అందుతున్న చికిత్సా విధానాన్ని పరిశీలించారు.దాదాపు అరగంట సేపు అక్కడే నిలబడి డాక్టర్లతో చికిత్స అందుతున్న తీరు గురించి క్షుణ్ణంగా ఆరా తీశారు. కాగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రపంచ స్థాయి అత్యున్నత చికిత్సను అందిస్తున్నామని, అవసరమైన మేరకు విదేశాల నుంచి కూడా డాక్టర్లతో కన్సల్టెన్సీ తీసుకుంటున్నామని డాక్టర్లు తెలిపారు.గుండె, ఊపిరితిత్తులు మిగతా అవయవాలు అన్నీ పనిచేస్తున్నాయని కాకపోతే కొంత బ్రెయిన్ ఇంకా పునరుత్తేజం చెందాల్సి ఉన్నదని అందుకు మరో 48 గంటలు సమయం పట్టే అవకాశం ఉన్నదని డాక్టర్లు వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో, స్పష్టమైన నిర్దిష్ట సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు.

