Telangana : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తానే స్వయంగా పాదయాత్ర చేస్తానని అధికారికంగా ప్రకటించారు. నిన్న ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన బీఆర్‌ఎస్ఎల్పీ సమావేశంలో ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు.
తెలంగాణలో సాగునీటి హక్కుల సాధన కోసం, రైతుల ప్రయోజనాల కోసం లక్ష మందితో కలిసి కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను సందర్శిస్తానని, అవసరమైతే తానే స్వయంగా పాదయాత్ర చేపడతానని స్పష్టం చేశారు. ఈ పాదయాత్రలో బీఆర్ఎస్ నేతలతో పాటు రైతులు కూడా పాల్గొంటారని కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటించారు. అయితే కేసీఆర్ నిజంగా పాదయాత్ర చేస్తారా? అన్నదే అందరిలోనూ కలుగుతున్న అనుమానం. ఎందుకంటే గతంలోనూ ఇలాంటి ప్రకటనలు చేసి మానుకోవడం ఆయనకు అలవాటు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రధాన అజెండాఇదే...తెలంగాణలో నీటి సమస్య, సాగునీటి ప్రాజెక్టుల రక్షణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశంరేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తిరిగి రాజకీయంగా పట్టు సాధించేందుకు కేసీఆర్ ఈ 'కమ్‌బ్యాక్' వ్యూహాన్ని రచిస్తున్నారు.ప్పుడు, ఏ రూట్‌లో ప్రారంభమవుతుందనే పూర్తి షెడ్యూల్ త్వరలోనే వెల్లడి కానుంది. కేసీఆర్ పాదయాత్ర ప్రకటనపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేసిందే కేసీఆర్ అని, ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తానంటే ప్రజలు నవ్వుకుంటారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారుగతంలో ఇలాంటి ప్రకటననే...కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతానని స్పష్టం చేయడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఈ యాత్ర ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలోనూ ఎన్నోమార్లు ఇలా జనంలోకి వస్తానని చెప్పడం, తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమవ్వడాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. నిజంగా ఆయనకు అంత ఓపికే ఉంటే ఇప్పటికే ప్రజా క్షేత్రంలోకి వచ్చేవారని, కేసీఆర్ పాదయాత్ర చేస్తారా? అన్నది అనుమానమేనని గులాబీ పార్టీ నేతల నుంచే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వరంగల్ లో పార్టీ 25 ఏళ్లు సందర్భంగా చేసిన ప్రకటనను గుర్తు చేస్తున్నారు. అలాగే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మూడు ప్రాంతాల్లో బహిరంగ సభలు పెడతామని, తాను హాజరవుతానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని అంటున్నారు. ఈ పాదయాత్ర కూడా అదే కోవలోకి వస్తుందా? అన్న సందేహాలు మాత్రం అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.

