కేరళలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీడీ సతీశన్ నియామకం పట్ల అసంతృప్తి తలెత్తింది. రమేష్ చెన్నితాల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం చివర వరకూ ప్రయత్నించారు.
వీడీ సతీశన్ పేరును నాయకత్వం ప్రకటించడంతో రమేష్ చెన్నితాల కేరళ నుంచి గురువాయూర్ వెళ్లిపోయారు.
గురవాయూర్ వెళ్లిపోయిన...
రమేష్ చెన్నితాలతో రాహుల్ గాంధీ ఫోన్ లో మాట్లాడారు. వీడీ సతీశన్ ను ఎంపిక చేశామని చెప్పడంతో ఆయన అసంతృప్తితో గురవాయూర్ కు బయలుదేరి వెళ్లిపోయారు. ఫోన్ కూడా స్విచాఫ్ చేశారు. మరొకవైపు రాత్రి ఏడు గంటలకు కేరళ కాంగ్రెస్ నేతలతో పాటు మిత్రపక్షాల నేతలు కూడా గవర్నర్ ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కోరనున్నారు. ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నామని చెప్పనున్నారు.

