సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ కీలక నేతల సమావేశం జరిగింది. కేరళ సీఎం ఎంపిక, తమిళనాడులో టీవీకే పార్టీకి మద్దతు, తదితర కీలక అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతోంది.
కేరళలో ముగ్గురు పేర్లను కాంగ్రెస నాయకత్వం పరిశీలిస్తుంది. రమేష్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ తో పాటు మరొక పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొంత సమయం తీసుకునైనా కేరళలో పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే నేతలను పార్టీ ఎంపిక చేయనుంది.
తమిళనాడులో మాత్రం...
ఇప్పటికే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు అంశంలో టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సెక్యులర్ కూటమిని ఏర్పాటు చేయాలన్న విజయ్ లక్ష్యం సరైనదని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీలో అంతర్గత చర్చల తర్వాతే నిర్ణయం ప్రకటించామని, విజయ్ చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే ఫలించి, మంచి ఫలితాలిస్తాయని అభిప్రాయపడింది.

