కేరళం నూతన ముఖ్యమంత్రి ఎంపిక పై ఉత్కంఠ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు కొనసాగుతుంది. కేరళంలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధించింది. అయినా ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై నాయకత్వం సమాలోచనలు చేస్తుంది.
సోనియా గాంధీ నివాసంలో సమావేశమైన కాంగ్రెస్ కీలక నేతలు వీలయినంత త్వరగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ కూడా రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక సత్వరం చేపట్టాలని నిర్ణయించారు. కేరళకు పరిశీలకులను పంపాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది.
పరిశీలకులుగా...ఈ రోజు కేరళం ఏఐసీసీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ లు వెళ్లనున్నారు. కేరళ పర్యటనకు ముందు మల్లిఖార్జున ఖర్గే తో సమావేశమైన అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ చర్చించారు. సీఎం రేసులో వీడి సతీషన్, రమేష్ చెనితల, కేసీ వేణుగోపాల్ లు ఉన్నారు. సీఎం రేసులో ముందు వరుసలో సతీశన్ ఉన్నారని చెబుతున్నారు. అయితే ఇప్పటికే పార్టీ నాయకత్వాన్ని కలిసిన రమేష్ చెనితల తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. రేపు కేరళం నూతన సీఎం పేరు వెల్లడికానుంది. రేపు ఉదయం 10.30కు కేరళం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. సమావేశంలో తమ శాసనసభాపక్ష నేతను కాంగ్రెస్ సభ్యులు ఎన్నుకోనున్నారు. సీల్డ్ కవర్ లో...అయితే సీల్డ్ కవర్ లో పరిశీలకులు ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును పంపుతారని, వారి పేరున శాసనసభ పక్షం ఖరారు చేస్తుందని చర్చ నడుస్తుంది. కేసీ వేణుగోపాల్ అవసరం కేంద్ర నాయకత్వానికి అవసరం కనుక ఆయన పేరు ఉండకపోవచ్చన్న టాక్ బలంగా వినపడుతుంది. మరొకవైపు వీడి సతీశన్ పేరు మాత్రం ఢిల్లీ స్థాయిలో బాగా వినిపిస్తుంది. ఆయన పేరు ముఖ్యమంత్రిగా ఫైనల్ చేసే అవకాశముందన్న ప్రచారం ఊపందుకుంది. వీడి సతీశన్ కారణంగానే కేరళలో పార్టీ బలోపేతం అయిందని నమ్ముతున్న నాయకత్వం ఆయన పేరు ఖరారు చేస్తుందని అంటున్నారు.

