కేరళలో యూడీఎఫ్ గెలుపునకు టీం వర్క్ కారణమని ముఖ్యమంత్రి అభ్యర్థి వీడీ సతీశన్ తెలిపారు. తాను ముఖ్యమంత్రి కావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేశారని చెప్పారు.
కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల సహకారంతోనే యూడీఎఫ్ విజయం సాధించిందని చెప్పారు. కేరళలో కొత్త యుగంలోకి తీసుకెళతామని వీడీ సతీశన్ తెలిపారు.
ఎన్నికల మ్యానిఫేస్టోలో...
ఎన్నికల మ్యానిఫేస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలుచేస్తామని వీడీ సతీశన్ తెలిపారు. రమేష్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ తనకు మంచి మిత్రులని ఆయన తెలిపారు. సీనియర్ నేతల వ్యూహరచనతోనే కేరళ ఎన్నికల్లో యూడీఎఫ్ విజ.యం సాధించిందని చెప్పారు.తాను ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.

