Dailyhunt
కేరళంలో ముగిసిన రేవంత్ పర్యటన

కేరళంలో ముగిసిన రేవంత్ పర్యటన

TeluguPost.com 0 months ago

కేరళంలో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. పలు సమావేశాలు, సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ఆయన మంత్రులు తెలంగాణకు వస్తే తాము గ్యారంటీలు ఎలా అమలు చేస్తున్నామో ప్రత్యక్షంగా చూపుతామని సీఎం తెలిపారు.

కేరళంలో పినరాయి విజయన్ హయాం ముగిసిందని, ఇక యూడీఎఫ్ స్వర్ణయుగం మొదలవుతుందన్నారు. ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.

పినరయి మోదీ బ్రదర్...దేశాన్ని, కేరళంనూ మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారని మోదీ.. విజయన్‌ను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. దేవుడి స్వంత రాష్ట్రంలో దేవుడి ఆస్తికీ రక్షణ లేదంటూ పరోక్షంగా శబరిమల బంగారం ఉదంతాన్ని సీఎం లేవనెత్తారు. కేరళంలో గత పదేళ్లుగా పినరాయి విజయన్ ప్రభుత్వం కొనసాగుతోందని, అలాగే 2014 నుంచి సుమారు పదేళ్ల పాటు కేసీఆర్ తెలంగాణను పాలించారన్నారు. పినరాయి కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలో పినరాయి విజయన్‌, కేసీఆర్‌ల మధ్య అనేక పోలికలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu