ధాన్యం సేకరణలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధాన్యం సేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు.
సేకరించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. ధాన్యం సేకరణ చేతకాని ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందని ఆరోపించారు. ప్రతి ఏడాది ధాన్యం సేకరించకుండా రైతుల ఉసురుపోసుకుంటుందని ప్రభుత్వంపై కిషన్ రెడ్డి మండి పడ్డారు.
ఏ రాష్ట్రంలో లేని సమస్యలు...
ఏ రాష్ట్రంలో లేని సమస్యలు తెలంగాణలోనే ఎందుకు వస్తున్నాయని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం సేకరణపై ప్రభుత్వం వద్ద ప్లాన్ లేదన్న కిషన్ రెడ్డి ప్రభుత్వం తీరువల్లనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కనీసం గన్నీ బ్యాగులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో లేని సమస్యలు ఇక్కడే ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ నేతలు యాత్ర చేసే వరకూ ధాన్యం సేకరణపై స్పందించలేదన్నారు.

