Andhra Pradesh : మాజీ మంత్రి కొడాలి నాని కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యూట్యూబర్ రావణ్ తమ పార్టీకి చెందిన వారు కాదని తెలిపారు. రావణ్ కు టీడీపీతోనే సంబంధాలున్నాయని కొడాలి నాని చెప్పారు.
అందుకే టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు చేసినా ఎక్కడా స్పందించలేదని, కేసులు కూడా ఎక్కడా టీడీపీ నేతలు రావణ్ పై పెట్టలేదని కొడాలి నాని అన్నారు.
రావణ్ తమ పార్టీకి...
రావణ్ ను తమ పార్టీకి అంటగట్టాలని చూస్తున్నారని, ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారం రావణ్ పై కేసులు పెట్టి విజయవాడలో సాయికృష్ణ కేసు నుంచి ప్రజలదృష్టిని మరల్చడానికి చేసిన ప్రయత్నమేనని కొడాలి నాని అన్నారు. కూటమి ప్రభుత్వానికి ఇక నూకలు చెల్లాయని కొడాలి నాని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే గెలుపు అని అన్నారు.

