Telangana : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీకి కేటీఆర్ బయలుదేరి వెళతారు.
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కేటీఆర్ సమావేశం కానున్నారు. సిరిసిల్ల రైల్వే లైన్ కోసం కేంద్రమంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేయనున్నారు.
గెట్ టుగెదర్ కార్యక్రమంలో...ఈరోజు రాత్రి బ్రిటీష్ ఎంపీ ఉదయ్ నాగరాజు ఏర్పాటు చేసిన గెట్ టు గెదర్‌లో కేటీఆర్ పాల్గొననున్నారు. బ్రిటన్ ఎంపీగా ఎన్నికైన తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు ఢిల్లీలో గెట్ టుగెదర్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలోపాల్గొన్న అనంతరం రేపు తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు.

