Hyderabad : నేడు నాంపల్లి ఏసీబీ కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కోర్టుకు కేటీఆర్ హాజరుకానున్నారు.
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను విచారించిన తర్వాత ఛార్జిషీట్ ను దాఖలు చేసిన నేపథ్యంలో న్యాయస్థానంలో నేడు ఈ కేసు విచారణ జరగనుంది.
ఫార్ములా ఈ రేసు కేసులో...ఈ విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. దీంతో నేడు కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. కేటీఆర్ కోర్టుకు వస్తుండటంతో భారీగా బీఆర్ఎస్ క్యాడర్ వస్తుందని భావించిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే కేసులో విచారణకు రిటైర్డ్ ఐఏఎస్ అరవింద్‌కుమార్ కూడా హాజరుకానున్నారు.

