Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Liquor Scam : లిక్కర్ స్కామ్ కేసులో కిరణ్ కుమార్ రెడ్డి లొంగుబాటు

Liquor Scam : లిక్కర్ స్కామ్ కేసులో కిరణ్ కుమార్ రెడ్డి లొంగుబాటు

TeluguPost.com 1 week ago

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డి సిట్ ఎదుట లొంగిపోయారు.

కిరణ్‌కుమార్‌ను నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. విదేశాల నుంచి వచ్చినకిరణ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు విచారించారు.

ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు...

కిరణ్ కుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో సిట్ ముందు లొంగిపోవాలన్న ఆదేశాలతో విదేశాల నుండి వచ్చిన నిందితుడు కిరణ్ కుమార్ రెడ్డి లొంగిపోయాడు. లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడుగా ఉన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి.రాజ్ కేసిరెడ్డితో కలిసి ఆర్థిక లావాదేవీల నిర్వహణలో కీలకంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని హైదరాబాదు నుంచి విజయవాడ సిట్ అధికారులు తీసుకురానున్నారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu