తన కాన్వాయ్‌ను కుదించుకోవాలని మంత్రి నారా లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రెండు వాహనాలకే మంత్రి లోకేశ్ కాన్వాయ్ పరిమితం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన పొదుపు చర్యల్లో భాగంగా లోకేశ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
తన కాన్వాయ్‌లోని వాహనాలను సగానికి తగ్గించాలని భద్రతా సిబ్బందికి మంత్రి లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి నారాయణ కూడా...అలాగే మంత్రి నారాయణ కూడా తన కాన్వాయ్ ను కుదించుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు సీఎం, డిప్యూటీ సీఎం తరహాలోనే, తమ కాన్వాయ్ మంత్రులు కుదించుకుంటున్నారు గతంలో మంత్రి నారాయణ కారుతో పాటు కాన్వాయ్‌లో మరో నాలుగు వాహనాలుండేవి. తన వాహన శ్రేణిలో రెండు వాహనాలు తగ్గిస్తూ మంత్రి నారాయణ నిర్ణయం తీసుకున్నారు.

