Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహారాష్ట్రలో దారుణం... పులి దాడిలో నలుగురు మహిళల మృతి

మహారాష్ట్రలో దారుణం... పులి దాడిలో నలుగురు మహిళల మృతి

TeluguPost.com 2 days ago

హారాష్ట్రలో దారుణం జరిగింది. పులి దాడిలో నలుగురు మహిళలు మరణించారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులి దాడి చేసింది. తునీకాకు సేకరించేందుకు అడవిలోకి వెళ్లిన మహిళలపై పులి మాటు వేసి దాటి వేసింది.

ఉదయం తునీకాకు సేకరించడానికి వెళ్లిన మహిళలపై దాడి చేయడంతో వారు అక్కడికక్కడే మరణించారు.

తునీకాకు సేకరణకు వెళ్లిన...చంద్రపూర్ జిల్లాలో పులి సంచారం ఉందని తెలిసి అటవీ శాఖ అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు. ఎవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు. అయినా మహిళలు తునీకాకు సేకరించడానికి వెళ్లడంతో పులి దాడి చేయడంతో నలుగురు మహిళలు మరణించారు. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులిని బంధించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu