సత్యసాయి మహాసమాధిని మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన లోకేశ్ పుట్టపర్తికి చేరుకున్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఈ ఉదయం సత్యసాయి మహాసమాధిని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
మహా సమాధిని దర్శించుకుని నారా లోకేశ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆలయ అధికారులు...ఆలయ అధికారులు మంత్రి లోకేశ్ కు సాదర స్వాగతం పలికారు. కాసేపు మహాసమాధి వద్ద ఉన్న లోకేశ్ ప్రార్థనలు చేసిన అనంతరం పుట్టపర్తిలోని బాబా నిలయాన్ని సందర్శించారుర. మంత్రి లోకేశ్ వెంట బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు రాజు కూడా పాల్గొన్నారు.

