Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Maharashtra : ముంబయికి రెడ్ అలెర్ట్.. మళ్లీ వానలు

Maharashtra : ముంబయికి రెడ్ అలెర్ట్.. మళ్లీ వానలు

TeluguPost.com 2 weeks ago

Mumbai :భారత వాతావరణ శాఖ ముంబయికి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబయితోపాటు థానే మరియు రాయ్‌గఢ్ జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ హెచ్చరించింది.ముంబయిలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది.

విద్యాసంస్థలకు సెలవులు...

ముంబయి నగరంలో మరియు శివారు ప్రాంతాల్లో 200 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.ప్రయాణాలపై ప్రభావం చూపుతోంది. ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా విమానాలు, లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి.ప్రైవేట్ కార్యాలయాలు ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' సౌకర్యం కల్పించాలని సూచించారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu