అమీర్ పేట లోని మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఎన్టీఆర్ 23 అడుగుల విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. తెలుగు జాతికి గర్వ కారణం ఎన్టీఆర్ అన్నారు. భారత దేశ చరిత్రను తెలుసుకోవాలంటే ముగ్గురిని స్మరించుకోవాల్సి ఉందని, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్, ఉక్కుమహిళ ఇందిరగాంధీ, మూడో వ్యక్తి ఎన్టీఆర్ అని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలుగు వారి గుండెల్లో...రాష్ట్ర విభజన జరిగినప్పటికీ, తెలుగు వారి గుండెల్లో నటుడిగా, రాజకీయ నేతగా చిరకాలం గుర్తుండిపోయే నేత ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. అలాంటి ఎన్టీఆర్ ను గౌరవించుకోవడం సంప్రదాయమని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ కు ప్రాంతాలతో సంబంధం లేదని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నో సంస్కరణలను తీసుకు వచ్చిన ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించుకోవడం కోసం ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, పీసీపీ చీఫ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

