Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మమతకు షాకిచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు

మమతకు షాకిచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు

TeluguPost.com 3 weeks ago

శ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ఈరోజు టీఎంసీ సమావేశానికి కేవలం ఇరవై మంది శాసనసభ్యులు మాత్రమే హాజరయ్యారు.

ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎనభైమంది టీఎంసీ నుంచి గెలిచారు. అయితే వీరిలో అరవై మంది ఎమ్మెల్యేలు కీలక సమావేశానికి హాజరవ్వడం చర్చనీయాంశమైంది.

ఇరవై మంది హాజరు కావడంతో...

మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై దాడికి సంబంధించిన అంశంపై చర్చించేందుకు మమత ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే టీఎంసీకి చెందిన కొందరు ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఎమ్మెల్యేలు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో ఉండటంతో రాలేకపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో డుమ్మా కొట్టడంపై మాత్రం పార్టీలో చర్చ జరుగుతుంది.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu