మే 24 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా బందుకు అసోసియేషన్ పిలుపునిచ్చింది.
కోవిడ్ సమయంలో వచ్చిన ఆదేశాలను అడ్డంగా పెట్టుకుని అక్రమ దందా జరుగుతుందని ఆరోపిస్తుంది.
నకిలీ మందులతో పాటు...
ఆన్ లైన్ బిజినెస్ లో నకిలీ మందులతో పాటు ప్రమాదకరమైన మందులు సరఫరా అవుతున్నాయని పేర్కొన్న అసోసియేషన్.. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆన్లైన్ సేవలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 24వ తేదీన మెడికల్ దుకాణాలను బంద్ చేయాలని అసోసియేషన్ నిర్ణయించింది.

