Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
MIM : మీ బెదిరింపులకు లొంగేది లేదు : అక్బరుద్దీన్ ఒవైసీ

MIM : మీ బెదిరింపులకు లొంగేది లేదు : అక్బరుద్దీన్ ఒవైసీ

TeluguPost.com 3 weeks ago

Hyderabad : ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ వార్నింగ్ ఇచ్చారు. తను భయపెట్టాలని కొందరు చూస్తున్నారని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. బెదిరింపులకు లొంగేది లేదని అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు.

ఎంఐఎంకు చెందిన విద్యాసంస్థలను కూల్చివేస్తామని కొందరు బెదిరిస్తున్నారని, కానీ ఇలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదని తెలిపారు. ఫాతిమా కళాశాలపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు.

ఒకటి కూలిస్తే...తమ విద్యాసంస్థను ఎలా కాపాడు కోవాలో తమకు తెలుసునని అన్నారు. ఒక విద్యాసంస్థను కూల్చివేస్తే వంద విద్యాసంస్థలు నిర్మిస్తామని అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పారు. తమను బెదిరించి లొంగదీసుకోవాలని భావించడం అవివేకమని అన్నారు. వేలాది మందికి విద్యాబోధన చేసిన విద్యాసంస్థలను కూల్చివేస్తామనడం దారుణమని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu