Rajahmundry : కాకినాడకు చెందిన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రార్ రాజమహేంద్రవరంలోని ప్రత్యేక న్యాయస్థానానికి సూచించారు.
ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి వర్తమానం పంపించారు.
అనంతబాబు జైల్లో...సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణను నవంబరు 30 నాటికి పూర్తిచేసి, తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ఏ1 కాగా, ఆయన భార్య లక్ష్మీదుర్గ ఏ2గా ఉన్నారు. అనంతబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

