నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు కడపకు చేరుకుంటారు. రేపు ఉదయం కడప ఎన్ జీవో కాలనీ వద్ద ఏర్పాటుచేసిన వేదికలో కడప నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొంటారు.
అనంతరం జమ్మలమడుగు నియోజకవర్గం ఉదయం 10.40 - 11.10 జమ్మలమడుగు నియోజకవర్గం పెనికలపాడులో సేంద్రియ రైతులతో సమావేశం అవుతారు.
రేపు జమ్మలమడుగులో...
మధ్యాహ్నం 12.20 - 02.10 జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టి.కోడూరులో ఏఈఎల్ (SAEL) 600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ప్రారంభిస్తారు.మధ్యాహ్నం జమ్మలమడుగు నియోజకవర్గం దత్తాపురం వద్ద ఏర్పాటుచేసిన వేదికలో జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొంటారు

