Tirumala : తిరుమలలో శ్రీవారి సేవలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. సామాన్య భక్తుడిలా తిరుప్పావడ సేవలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేశ్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకుని రాష్ట్రం సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరారు.
దర్శనం అనంతరం...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రావాలని తిరుమల శ్రీవెంకటేశ్వరుడిని ప్రార్ధించినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అలాగే ప్రజలంతా సుఖ సంతోషాలతోఉండాలని కోరుకున్నానని చెప్పారు. దర్శనం అనంతరం వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను నారా లోకేశ్ కు టీటీడీ అధికారులు అందజేశారు.

