India : నేటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ఈ నెల 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో పర్యటించనున్నారు.
ఈ నెల 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు.
మొత్తం మూడు దేశాల్లో...
అనంతరం ఈ నెల 10 నుంచి 11 వరకు న్యూజిలాండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉండనుంది. మూడు దేశాల అధినేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో ఇరు దేశాలకు చెందిన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడానికి ఈ పర్యటన ఉపయోగపడనుంది.

