భారత ప్రధాని నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుంది. కింగ్ విల్లెం-అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాను ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కలవనున్నారు.
ఇరు దేశాల మధ్య నెలకొన్న అనేక అంశాలపై చర్చించనున్నారు.
మరికొన్ని దేశాల్లోనూ...నెదర్లాండ్స్‌లోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. నెదర్లాండ్స్ తర్వాత స్వీడన్, నార్వే, ఇటలీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం నాలుగుదేశాల్లో పర్యటించి రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపర్చే ప్రయత్నం చేయనున్నారు. ఆ దేశాధి నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరపననున్నారు.

