నేడు దేశ వ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్ ను నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోనూ మందుల దుకాణాలు తెరుచుకోలేదు. ఉదయం నుంచి మందుల షాపులు మూసి వేసి ఉంచారు.
ఆన్ లైన్ లో మందుల విక్రయం, అధిక డిస్కౌంట్లతో తమకు ఇబ్బంది కలుగుతుందని ఆలిండియా డ్రగ్టిస్ట్స్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ బంద్ కు పిలుపు నిచ్చింది. నకిలీ మందులను అరికట్టాలని కూడా డిమాండ్ చేస్తుంది.
ఆన్ లైన్ లో విక్రయాలతో...
ఆన్ లైన్ లో మెడికల్ దుకాణాల వల్ల సంప్రదాయ మెడికల్ దుకాణాల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని మెడికల్ దుకాణాల యాజమాన్యం ఆందోళన చేస్తుంది. ఎటువంటి ప్రిస్కిప్షన్ లేకుండా, ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండానే మెడిసిన్స్ ను ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారని చెబుతుంది. ప్రజారోగ్యం దీనివల్ల ప్రమాదంలో పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయని, ఇవి తమ ఆదాయానికి గండి కొడుతున్నాయని ఆరోపిస్తుంది. దేశ వ్యాప్తంగా 12.40 లక్షల మందుల దుకాణాలు మూతపడుతున్నాయి.

