Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఎండీ భేటీ

నేడు ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఎండీ భేటీ

TeluguPost.com 2 days ago

నేడు ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఎండీ కృష్ణబాబు సమావేశం అవుతున్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారం, ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంపై ఉద్యోగులు, యూనియన్ల ఆందోళనల నేపథ్యంలో ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ ఎం.టి.

కృష్ణబాబు అమరావతి సచివాలయంలో కార్మిక సంఘాలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఆర్టీసీ ప్రైవేటీకరణ జరుగుతుందనే వదంతులపై ఉద్యోగులకు స్పష్టత ఇవ్వనున్నారు. వారి సందేహాలను నివృత్తి చేయనున్నారు.

ప్రయివేటీకరించబోమని...

ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, ఈ-బస్సుల రాక వల్ల ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించే అవకాశం లేదని రవాణా శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. సమావేశానికి ఎనిమిది కార్మిక సంఘాలు హాజరు కానున్నాయి. ఇప్పటికే అనేక విడతలుగా ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేశారు.ఈనెల 26వ తేదీన ట్రేడ్ యూనియన్ నేతలతో ఆర్టీసీ కార్మికుల రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో నేడు ఎండీ కృష్ణ బాబు కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu