నేడు కేరళంలో వీడీ సతీశన్ ప్రభుత్వం కొలువుదీరనుంది. కేరళ ముఖ్యమంత్రిగా సతీశన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలో సీఎంగా సతీశన్ ప్రమాణస్వీకారం చేస్తారు.
యూడీఎఫ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లోఏకపక్ష విజయం సాధించడంతో వీడీ సతీశన్ ను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకత్వం ఎంపిక చేసింది.
మరో ఇరవై మంది...సతీశన్ తో పాటు మరో ఇరవై మంది నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని అంటున్నారు. వారిలో పథ్నాలుగు మంది కొత్త వారికే తన కేబినెట్ లో సతీశన్ అవకాశం కల్పించారు. యూడీఎఫ్ కూటమిలోని మిత్ర పక్షాలకు కూడా కేబినెట్ లో చోటు కల్పించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధఈ, ప్రియాంక, రేవంత్ రెడ్డి,భట్టి విక్రమార్కలు హాజరుకానున్నారు.

