నేడు పాలకొల్లులో ఆక్వా రైతుల ధర్నా నిర్వహించనున్నారు. రొయ్య కౌంట్ రేట్లు కేజీ కి 30 నుండి 40 రూపాయలు తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆక్వా రైతులు ఆందోళనకు దిగనున్నారు.
ఫీడ్ మరియు ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేట్ అయ్యి ఆక్వా రైతు కు అన్యాయం చేయడం పై నిరసన వ్యక్తం చేయనున్నారు.
కౌంట్ ధర తగ్గించినందుకు...జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపు నిచ్చారు. తగ్గించిన ధరలను పెంచాలంటూ ఆక్వా రైతులు ఆందోళనకు దిగుతుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యగా భారీగా పోలీసులు పాలకొల్లులో మొహరించారు.

