నేడు తెలంగాణ కేబినెట్ సబ్‌కమిటీ భేటీ సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరగనుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ప్రతి కుటుంబానికి జీవిత బీమా...
ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించడంపై సమావేశంలో చర్చించనున్నారు. పథకం విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. ఇటీవల ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీంతో కేబినెట్ కమిటీ సమావేశమై దీనిపై విధివిధానాలను ఖరారు చేయనుంది.

