నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. నాందేడ్‌లో అశ్విని కదం ఇంట్లో సోదాలు నిర్వహించింది. టెలిగ్రామ్ ద్వారా పేపర్ పంపిణీ చేసినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు.
ప్రశ్నాపత్రాన్ని ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది.
సీబీఐ అధికారులు...అయితే ఎవరెవరికి ప్రశ్నాపత్రాన్ని అమ్మారన్న దానిపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. పేపర్‌ను ఐదు లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన వారిని కూడా గుర్తించే పనిలో పడింది సీబీఐ. నిందితుల ఫోన్ కాల్స్‌పై సీబీఐ ఆరా తీస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నిట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో 9 మంది అరెస్ట్ అయ్యారు. నెట్‌వర్క్ వెనుక ఉన్న సూత్రధారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

