పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. తణుకు నియోజవర్గంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. ఇరగవరం మండలం తూర్పు విప్పర్రులో బైకులు ఢీ కొట్టడంతో ఒకరు మరణించారు.
ఈ ప్రమాదంలో సద్దాం హుస్సేన్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
ఇద్దరి మృతి...దువ్వ దగ్గర కారు ఢీకొని నూకరాజు అనే వృద్ధుడు మృతి చెందాడు. దీంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

