జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీని బలోపేతం చేయడం పై ఫోకస్ పెట్టారు. ఆయన క్షేత్రస్థాయిలో బలపడేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ గా అయ్యేందుకు పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నారు.
రానున్న ప్రభుత్వంలో జనసేన కీలకంగా మారితే కీలక పదవులతో పాటు తాము కోరిన సంఖ్యలో నామినేటెడ్ పోస్టులు అడిగేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. అందుకే పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ లేనిది జిల్లా స్థాయిలో సమన్వయ కర్తలను నియమించి నియోజకవర్గ స్థాయిలో సమావేశాలను నిర్వహించాలని ఇప్పటికే ఆదేశించారు. సమావేశాలు జరుగుతున్నాయి.
పార్టీ సభ్యత్వాలను...పలు చోట్ల నేతల మధ్య విభేదాలు కనిపిస్తున్నప్పటికీ, వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నప్పటికీ జనసేనను బలోపేతం చేయాలన్న పవన్ కల్యాణ్ ఆలోచన మాత్రం కొన్ని వర్గాలను మాత్రం ఆనందానికి గురి చేస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా ఇన్ ఛార్జులను నియమించడమే కాకుండా పార్టీ సభ్యత్వాలను కూడా అత్యధికంగా నమోదు చేయించడంతో పాటు తాను కూడా జిల్లాల వారీగా పర్యటిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింతగా బలోపేతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. జనసేన నేతలతో పాటు ముఖ్యమైన కార్యకర్తలను కూడా గుర్తించి వారికి పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు తెలిసింది. నేడు జనసేన ఆత్మీయ సమావేశం...అందులో భాగంగా నేడు జనసేన ఆత్మీయ సమావేశం జరగనుంది. జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. దాదాపు ఇరవై లక్షల మంది సభ్యులుగా చేరారు. దీంతో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ప్రభుత్వపరంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లి సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా వ్యవహరించిన సాధక్ లతో ఈరోజు సాయంత్రం ఆత్మీయ సమావేశం జరగనుంది. మంత్రులు, ఉద్యమి సభ్యత్వ నమోదుకు పార్లమెంట్ ఇంచార్జులుగా వ్యవహరించిన నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొంటారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిబలోపేతం చేయడంపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తం మీద జనసేనానిలో ఎన్నికలకు మూడేళ్ల ముందే మార్పు మొదలయినట్లు కనిపిస్తుంది.

